Jasprit Bumrah: వన్డేల్లో అరంగేట్రం చేసి ఆరేళ్లు | On This Day | Cricket | ABP Desam

Jasprit Bumrah... ఆరేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఈ పేరు పెద్దగా తెలియదు. IPLలో Mumbai Indians తరఫున ఆడుతూ తన విభిన్న బౌలింగ్ శైలితో అందరినీ ఆకట్టుకున్నాడు. 2016 జనవరి 23న ఆస్ట్రేలియా గడ్డ మీద తన వన్డేల అరంగేట్రం చేశాడు. ఇక అక్కడ్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వన్డేలు, టీ20లు, టెస్టులు... ఇలా ఏ ఫార్మాట్ అయినా భారత్ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలో Consistentగా పర్ఫార్మ్ చేస్తున్న మేటి బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఎంతగా ఎదిగాడంటే ఇప్పుడు టెస్టు కెప్టెన్ రేసులోనూ అతని పేరు వినిపిస్తోంది. అతడు భారత్ తరఫున మరెన్నో రికార్డులు సృష్టించాలని కోరుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola