Visakhapatnam ఎయిర్ పోర్టులో వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam

Continues below advertisement

విశాఖపట్నంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు..విశాఖ గర్జన... మరోవైపు పవన్ విశాఖ పర్యటన. వైజాగ్ ఎయిర్ పోర్టు లో పవన్ రాక కోసం.. జనసైనికులు కొన్ని గంటల ముందు నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే.. విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న వైసీపీ నేతలు ఎయిర్ పోర్టు వద్దకు వచ్చారు. మంత్రులు జోగి రమేశ్‌, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైకాపా నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram