Saibaba Acquitted : జైలు నుంచి ప్రొ. సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే | ABP Desam

మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషిగా తేలిన ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబాకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సాయిబాబా సహా మరో ఐదుగురిని బాంబే హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఏదైనా ఇతర కేసులో కస్టడీ అవసరమైతే తప్ప, ఆయనను తక్షణమే నాగ్‌పుర్‌ జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola