వేల కరోనా కేసులు నమోదవుతుంటే, తిరుపతి లో కబడ్డీ పోటీలు అవసరమా అని ప్రశ్నించిన జనసేన.
Continues below advertisement
గత వారం రోజుల్లో తొంభై వేల కరోనా కేసులు నమోదు అవుతుంటే తిరుపతిలో కబడ్డీ పోటీలు అవసరమా అని తిరుపతి జనసేన పార్టి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు.తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. 23 రాష్ట్రాల నుంచి క్రీడాకారులను రప్పించి వైరస్ వ్యాప్తికి మున్సిపల్ పెద్దలు కారణం అవుతున్నట్లు మండిపడ్డారు. తిరుపతిలో ఉన్న ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని,తిరుపతిలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని వాటిని పట్టించుకోకుండా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అవసరమా అంటూ ఆయన మున్సిపల్ అధికారులను నిలదీశారు.
Continues below advertisement