Jacqueline Fernandez: సుఖేష్-జాక్వలిన్ ఇంటిమేట్ ఫోటో లీక్.. బాధపడిన బాలీవుడ్ నటి
కాన్ మెన్ సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ పై ఇప్పటికే ఈడీ ఆంక్షలు విధించింది. ఈ మేరకు జాక్వలిన్ పై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా జాక్వెలిన్- సుఖేష్ లకు సంబంధించిన మరో ఫోటో బయటకొచ్చింది. ఇందులో సుఖేష్.. జాక్వెలిన్ ను ముద్దాడుతూ వారిద్దరూ ఇంటిమేట్ గా ఉన్నట్లు కనిపించారు. దీనిపై జాక్వలిన్ స్పందిస్తూ 'దయచేసి నా ప్రైవసీ, పెర్సనల్ స్పేస్ కి భంగం కలిగించే ఎలాంటి ఫొటోలను సర్క్యూలేట్ చేయొద్దు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ చేశారు.