భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

Continues below advertisement

లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై మొన్నటి వరకూ గగనతలం నుంచి దాడులు చేసింది ఇజ్రాయేల్. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోడానికి రంగంలోకి దిగింది. నేరుగా లెబనాన్‌కి వెళ్లిన సైన్యం...అక్కడి హెజ్బుల్లా సభ్యులతో తలపడుతోంది. తమ పౌరులపై దాడులు చేసి అత్యంత దారుణంగా హత్యలు చేశారన్న  పగతో రగిలిపోతోంది ఇజ్రాయేల్. అందుకే...హెజ్బుల్లాని పూర్తిగా అంతం చేసేంత వరకూ ఊరుకునేదే లేదని శపథం చేసింది. అయితే..ఈ యుద్ధం ఆపేయాలంటూ పలు దేశాలు ఇజ్రాయేల్‌కి హితబోధ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సలహాలని పెద్దగా పట్టించుకోని ఆ దేశం...తమకి సలహాలిచ్చే దేశాలన్నింటికీ కొన్ని వీడియోలతో కౌంటర్ ఇస్తోంది. లెబనాన్‌లో తాము దాడి చేయడానికి కారణమేంటో ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ కమాండర్‌లు స్పెషల్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. "మేం యుద్ధం చేయడానికి కారణమిదే" అని లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలను షూట్ చేస్తున్నారు. 

వాళ్లంతా ఎంత పకడ్బందీగా సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకున్నారో వివరిస్తున్నారు. అంతే కాదు. వాళ్ల స్థావరాలపై దాడులు చేసి..లోపలికి వెళ్లి అక్కడి ఆయుధాలనూ చూపిస్తున్నారు. వాటిలో చాలా అడ్వాన్స్‌డ్ వెపన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎలా వాడుతున్నారు..? ఇజ్రాయేల్ పౌరులపై ఎలా దాడులు చేస్తున్నారు..అనేది వివరిస్తూ వరుస పెట్టి పోస్ట్‌లు పెడుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే...తాము చేసేది సరైందే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. ఇంతలా తెగబడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఇన్‌డైరెక్ట్‌గా ఈ వీడియోలతో క్వశ్చన్ చేస్తోంది. ఇప్పటికే అటు హమాస్‌తో తలపడుతున్న ఇజ్రాయేల్..ఇప్పుడు హెజ్బుల్లాని మట్టుబెట్టే పనిలో పడింది. అటు మిత్రదేశమైన అమెరికా మాత్రం.. ఇజ్రాయేల్‌కి సలహాలు ఇస్తోంది. ముఖ్యంగా గాజా విషయంలో అసహనం వ్యక్తం చేస్తోంది. అక్కడ వైద్య సాయం అందించేందుకూ నిరాకరిస్తున్నారంటూ మండి పడుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram