Indian Cricket-BCCI: కేప్ టౌన్ లో శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించేందుకు అరుదైన అవకాశం ముంగిట నిలిచిన కోహ్లీ సేన... అందుకు తగ్గట్టుగా కేప్ టౌన్ లో చెమటోడుస్తోంది. 11వ తేదీన మొదలయ్యే మూడో టెస్టు కోసం నిన్ననే అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు.. ఇవాళ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రెండో టెస్టుకు దూరమైన కింగ్ కోహ్లీ... ప్రాక్టీస్ సెషన్ లో కనపడటం సానుకూలాంశం. ఆసీస్ టూర్, సొంతగడ్డపై ఇంగ్లండ్ తో సిరీస్ తర్వాత ఫాం కోల్పోయిన రిషబ్ పంత్ మూడో టెస్టుతో లయ అందుకోవాల్సి ఉంది. రెండో టెస్టు సాంతం హ్యామ్ స్ట్రింగ్ సమస్యతో బాధపడ్డ సిరాజ్ స్థానంలో 3వ టెస్టుకు ఇషాంత్, ఉమేశ్ లో ఒకరు జట్టులోకి రావచ్చు. ఇప్పటిదాకా సఫారీ గడ్డపై ఒక్క టెస్టూ నెగ్గని భారత్... ఈ సిరీస్ తో అయినా ఆ రికార్డును తిరగరాయాలని పట్టుదలగా ఉంది.