Madhulika Rawat: బిపిన్ రావత్ మిలటరీ చాపర్ ప్రమాదంలో మృతుల వివరాలు|
తమిళనాడులోని కూనూర్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో భారత డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ మరియు మరో 11 మంది మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్ వరుణ్ సింగ్.. వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జనరల్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి పేరు కున్వర్ మృగేందర్ సింగ్. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆమె సోదరుడు యశ్వర్ధన్ సింగ్ భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. బిపిన్ రావత్.. భార్య మధులిక రావత్.. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆర్మీ సిబ్బంది భార్య, పిల్లలు మరియు వారిపై ఆధారపడిన వారి శ్రేయస్సు కోసం ఆమె పనిచేశారు. మధులిక ఢిల్లీలో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితుల కోసం చాలా సేవ చేశారు.