Who is Bipin Rawat? నలభై రెండేళ్ల పాటు వివిధ హోదాల్లో బిపిన్ రావత్ అసమాన సేవలు

Continues below advertisement

భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ బిపిన్ రావత్. 2019 వరకు భారత్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌ అనే పోస్ట్ లేదు. కార్గిల్‌ యుద్ధం అనంతరం 1999లో కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్‌ రివ్యూ కమిటీ తొలిసారి సీడీఎస్‌ నియామక ప్రతిపాదన చేసింది. అయితే అది 2019 వరకు కార్యరూపం దాల్చలేదు. వాయుసేన, ఆర్మీ, నౌకాద‌ళం మూడింటికి వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. అయితే వారందర్నీ సమన్వయం చేసుకోవడానికి ఓ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో సీడీఎస్ పదవికి కేంద్రం సృష్టించింది. 2019లో తొలిసారిగాబ బిపిన్ రావత్‌ను నియమించారు. త్రివిధ దళాతల అధిపతిగా ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రి వరకూ ఉంది. అంతటి ఘనతలు సాధించిన బిపిన్ రావత్ లైఫ్ స్టోరీ ఓ సారి చూద్దాం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram