West Bengal SSC Scam | నోట్లు లెక్కపెట్టలేక మెషీన్లు పట్టుకొచ్చారు | Partha Chatarjee | ABP Desam
Continues below advertisement
పశ్చిమ బెంగాల్‌లో ఓ మంత్రి అసోసియేట్ ఇంట్లో నుంచి రూ. 20 కోట్ల నగదుని స్వాధీనం చేసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. వెస్ట్ బెంగాల్ మినిస్టర్ పార్థ ఛటర్జీ అసోసియేట్‌గా పని చేస్తున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈ నోట్ల కట్టలు దొరికాయి. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ ఈ ఇంట్లో రెయిడ్ నిర్వహించింది. స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)స్కామ్‌కు పాల్పడి ఇంత డబ్బు సంపాదించినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇన్ని నోట్ల కట్టలు చూసి ఆశ్చర్య పోయిన ఈడీ అధికారులు..వాటిని లెక్కబెట్టేందుకు బ్యాంక్ అధికారులను పిలిచారు. కౌంటింగ్ మెషీన్లు తీసుకొచ్చి మొత్తంలెక్కించారు. ఈ రెయిడ్ చేస్తున్న సమయంలోనే రూ.2,000, రూ.500 నోట్లన్నీ కట్టలుగా పడి ఉన్నాయి. ఈ డబ్బుతో పాటు 20 మొబైల్ ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు
Continues below advertisement