Vladimir Putin visit to India: శిఖరాగ్ర సదస్సు లో పలు కీలక ఒప్పందాలు..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఢిల్లీ లో సోమవారం చర్చలు జరగనున్నాయి. భారత్ రష్యాల బంధం మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ- పుతిన్ల శిఖరాగ్ర సదస్సు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9.30 గంటల సమయంలో పుతిన్ తిరుగు ప్రయాణం కానున్నారు. 2+2 బృందంలో భాగంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola