Nagaland Violence : నాగాలాండ్ లో హింసాత్మక ఘటనలపై సమాధానమిచ్చిన కేంద్రహోంమంత్రి | ABP Desam

Continues below advertisement

నాగాలాండ్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు."ఓటింగ్ ప్రాంతంలో మిలిటెంట్లు తిరుగుతున్నారనే సమాచారం సైన్యానికి అందింది. దీంతో అనుమానాస్పద ప్రాంతానికి 21 మంది కమాండోలు వెళ్లారు. అదే సమయానికి అక్కడకి ఓ వాహనం వచ్చింది. అయితే వాహనాన్ని ఆపాలని బలగాలు సంకేతమిచ్చాయి. కానీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఉగ్రవాదులనుకొని సైన్యం కాల్పులు జరిపింది. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు చనిపోయారు. అయితే ఆ తర్వాతే తప్పు చేసినట్లు సైన్యం గుర్తించింది. గాయపడిన ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి సైన్యం చేర్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టారు. 2 వాహనాలను తగులబెట్టి సైనికులపై దాడి చేశారు. ఈ దాడి కారణంగా ఓ జవాను మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత స్థానిక పోలీసులు పరిస్థితులను చక్కబెట్టారు."

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram