Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ టాలెంట్ చూశారా..
ABP Desam
Updated at:
06 Sep 2021 08:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తాజాగా సింగర్ అవతారమెత్తారు. శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సోమవారం ప్రాతినిధ్యం వహించారు. దూరదర్శన్ శ్రీనగర్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశిథరూర్.. 1974లో విడుదలైన అలనాటి బాలీవుడ్ క్లాసిక్ మూవీ అజ్నబీ నుంచి ఫేమస్ సాంగ్ ఏక్ అజ్నబీ హసీనా సే ఆలపించారు. ఈ పాటను ఏ మాత్రం ప్రాక్టీస్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ పాడానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. శశిథరూర్‌కు ఈ టాలెంట్ కూడా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.