Vishnu Vardhan Reddy: హిందువుల పండుగలకే ఆంక్షలు గుర్తొస్తాయా
బీజేపీ నేత సోము వీర్రాజు, భారతీయ జనతా పార్టీపై ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మతాలను రెచ్చగొడుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది వైసీపీ పార్టీ అని ఆరోపించారు. వెల్లంపల్లికి దమ్ముంటే ఒక వినాయక మండపం దగ్గరికి వెళ్లి యువకులకు విగ్రహం పెట్టవద్దని చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేవలం హిందువుల పండుగలకు మాత్రమే ఆంక్షలు గుర్తొస్తాయా.. మతాల మధ్యన చిచ్చు పెట్టేది మీరు, ఏపీ సీఎం జగన్ ప్రభుత్వమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై మీరు చూపిస్తున్న వివక్షను రాష్ట్రంలోని హిందువులంతా గమనిస్తున్నారని.. యావత్ హిందూ సమాజం త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.