Watch: రాజ్యసభలో వెంకయ్య కంటతడి.. వారి తీరుపై ఆవేదన, నిద్ర పట్టలేదంటూ..
ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు బుధవారం నాటి రాజ్యసభలో కంటతడి పెట్టారు. ఆయన ఆవేదన చెందుతూ గద్గద స్వరంతో మాట్లాడారు. మంగళవారం నాటి సభలో కాంగ్రెస్ ఎంపీలు పలువురు తీవ్రమైన గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ఎంపీల ప్రవర్తనపై తాను కలత చెందానని వెంకయ్య ప్రకటించారు. వారు అలా ప్రవర్తించడంపై రాత్రి అసలు తనకు నిద్రపట్టలేదని ఆవేదన చెందారు.