Timelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP Desam

Continues below advertisement

 ఇస్రో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అంతరిక్షంలో వ్యవసాయం చేసి చూపించింది. రీసెంట్ గా ఇస్రో ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాల్లో క్రాప్స్ అనే ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే ఈ ప్రయోగంలో కొన్ని అలసంద విత్తనాలను స్పేస్ క్రాఫ్ట్ తో పాటు జాగ్రత్తగా పంపించారు. ఇప్పుడు అవి పగిలి వాటిలోనుంచి మొక్కలు బయటకు వచ్చాయి. స్పేస్ లో ఉండే మైక్రో గ్రావిటీ కారణంగా వ్యవసాయం కష్టం కాగా ప్రత్యేక పరిస్థితులను కల్పించి  విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఇదిగో ఇలా అంతరిక్షంలో వ్యవసాయం చేసి అద్భుతం చేయగలిగారు. ఫ్యూచర్ లో వేరే గ్రహాలపై మానవ యాత్రలు ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధానం అద్భుతంగా ఉపయోగపడనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా లాంటి దేశాలు మొక్కలపై అంతరిక్షంలో ప్రయోగాలు చేయగా ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. అంతరిక్ష యాత్రలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సన్నద్దం చేసుకుంటోంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram