Tamilnadu Kallakurichi Adulterated Liquor Issue | తమిళనాడు కల్లకుర్చిలో కల్తీసారా కల్లోలం |ABP Desam

Continues below advertisement

Tamil Nadu hooch tragedy: తమిళనాడులోని కళ్లకురిచి ఘటన పెను విషాదంగా మారుతోంది. గంటలు గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి కల్తీ సారా తాగి 30 మంది వరకు మృతి చెందారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మందికి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యలు చెబుతున్నారు. 

కల్తీ సారా తాగి కళ్లకురిచి ఆసుపత్రిలో చేరుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ కల్తీసారా ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే పలువులు అధికారులను సస్పెండ్‌ చేసింది. జిల్లా కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్ జాతావత్‌ను బదిలీ వేటు వేసింది. మరణాలపై సమాచారం తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంది. ఎస్పీ సమయసింగ్ మీనాను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీళ్లతోపాటు మరో 9 మంది పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు సీనియర్ అధికారులను కళ్లకురిచి పంపించింది. ఎంఎస్‌ ప్రశాంత్‌ను ఆ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఎస్పీగా రజత్‌ చదుర్వేదీని ఎస్పీగా తీసుకొచ్చింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram