NEET Controversies Explained: నీట్ చుట్టూ ముసురుకున్న వివాదాలు ఏంటి?
NEET Controversies Explained: మన దేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (MBBS), దంత (డెంటల్ ) వైద్య కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం పెట్టే ప్రవేశ పరీక్షే నీట్ (NEET Exam). దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నిటికీ ఈ పరీక్ష వర్తిస్తుంది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే మెడికల్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. దీన్ని గతంలో ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్ (ఎఐపిఎంటి) అనేవారు. వివిధ రాష్ట్రాలు, కళాశాలలూ గతంలో స్వంతంగా నిర్వహించుకునేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రవేశ పరీక్షలన్నిటినీ రద్దుచేసి, వాటి స్థానంలో నీట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తోంది.
2024 నీట్ ఎగ్జామ్ మే 5వ తేదీన జరిగింది. 24 లక్షల మంది ఈ పరీక్షకు హజరయ్యారు. వీటి షెడ్యూల్ ప్రకారం నీట్ ఫలి తాలు జూన్ 14వ తేదీన వెళ్లడించాల్సి ఉండగా, పది రోజుల ముందుగా అంటే జూన్ 4వ తేదీననే వెళ్లడించారు. ఇంత త్వరగా షెడ్యూల్ కన్నా ముందుగా ఎందుకు వెళ్లడించారు అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా.....లేదంటే తాము త్వరగా ఫలితాలు వెళ్లడించడం వల్ల నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీకి మంచి పేరు వస్తుందనా అన్నది తేలాల్సి ఉంది. ఈ వివాదాలేమి జరగకుండా ఉండి ఉంటే ఎన్టీఏ అధికారులకు ఫలితాలు త్వరగా వెళ్లడించినందుకు అభినందనలు దక్కేవి. వివాదాలమయంగా నీట్ ఎగ్జామ్ మారడం కారణంగా.. ఇంత త్వరగా రిజల్ట్ ఎందుకు వెళ్లడించారు.. దీని వెనుక ఏమైనా కుట్రలున్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.