Baba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?

Continues below advertisement

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని నడిరోడ్డుపైనే తుపాకీతో కాల్చి హత్య చేయడం.. రాష్ట్రంలోనే కాక, బాలీవుడ్‌లోనూ సంచలనం అవుతుంది. ఈయన సల్మాన్ ఖాన్ కు చాలా మంచి స్నేహితుడు. అప్పట్లో షారూఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ మధ్య ఏళ్ల తరబడి ఉన్న గొడవను ఈయనే సద్దుమణిగేలా చేశారు. ఆయనను ఇంత దారుణంగా చంపడానికి ప్రధానంగా రెండు కారణాలపై పోలీసులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

ఒకటి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం.. ఇంకోటి స్లమ్‌ డెవలప్‌మెంట్‌ స్కాం. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ పదేపదే బెదిరింపులు ఎదుర్కొన్న సంగత తెలిసిందే. సల్మాన్ తో సిద్ధిక్ సన్నిహితంగా ఉండడం వల్లనే సిద్దిక్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు టార్గెట్ అయ్యారని భావిస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్‌ పై దాడి చేయాలని లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తోంది. ఎన్నో బెదిరింపులు.. ఓపెన్ వార్నింగ్ లు కూడా చేసింది. సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన హత్యా ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలం కూడా అయ్యాయి. సల్మాన్ ఖాన్ క్రిష్ణ జింకలను వేటాడిన కేసులో చిక్కుకున్నప్పటి నుంచి.. జింకలను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సిద్దిక్ కి ప్రాణహాని ఉండడ వల్లనే ఆయనకు 'వై' కేటగిరీ భద్రత కూడా కల్పించారు. 

ఇంకో కారణం.. బాబా సిద్ధిఖీకి ఓ స్లమ్‌ రిహాబిలిటేషన్‌ ప్రాజెక్టు విషయంలో వ్యాపార విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంట్లో అవకతవకల వల్ల ప్రెసెంట్ ఈడీ దర్యాప్తు జరుగుతోంది. 2004కి ముందు సిద్దిఖీ మహారాష్ట్ర హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు స్లమ్‌ రిహాబిలిటేషన్‌ ప్రాజెక్టు చేపట్టారు. దీంట్లో 2 వేల కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2012లో దీనిపై అబ్దుల్‌ సలామ్‌ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా.. 2014లో సిద్ధిఖీ సహా 150 మందిపై కేసు నమోదైంది. 2018లో ఈడీ బాబా సిద్ధిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తిని అటాచ్‌ చేసి.. మనీలాండరింగ్‌ కేసు పెట్టింది. ఈ రెండు ఘటనలే ఆయన హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram