Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లే

Continues below advertisement

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. తన స్నేహితుడు బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యారనే వార్త తెలియగానే సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా షాక్‌కి గురై.. బిగ్‌బాస్ హిందీ షూటింగ్‌లో ఉన్నా కూడా దాన్ని రద్దు చేసుకొని మరీ లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సిద్దిఖీ మృతదేహానికి నివాళి అర్పించారు. సిద్దిఖీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండడమే కాదు.. బాలీవుడ్‌లో 2013లో ఓ పెద్ద సయోధ్య కుదిర్చి అప్పట్లో బాగా హైలైట్ అయ్యారు. ఆ సయోధ్య కుదిర్చింది.. సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ మధ్యనే.

బాలీవుడ్‌కి చెందిన ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య 2013 వరకూ కోల్డ్ వార్ తీవ్రంగా ఉండేది. అలా ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో బాలీవుడ్ కూడా ముఖ్యంగా నిర్మాతలు కూడా వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉండేది. ఈ కోల్డ్ వార్ మొదలవడానికి మూలం 2008లో జరిగిన ఓ ఘటన. 2008లో కత్రినా కైఫ్ 25వ పుట్టినరోజు వేడుకలో సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ మధ్య బేధాభిప్రాయాలు మొదలైనట్లుగా చెప్తారు. అలా ఐదేళ్ల పాటు ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య కోల్డ్ వార్ కొనసాగి బాలీవుడ్ అంతా వర్గాలుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిని బాబా సిద్దిఖీ 2013లో ముగించారు. 2013లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను దగ్గరచేసి వారి మధ్య గొడవను సిద్దిఖీనే పరిష్కరించారు. అప్పట్లోనే వైరల్‌గా మారి.. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది చూసిన వీడియోలో షారుఖ్ లేచి, కౌగిలింతతో ఒకరినొకరు పలకరించుకునే ముందు ఇద్దరు స్టార్‌లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. బాబా సిద్ధిక్ వారితో కలిసి భుజాలపై చేతులు వేసి ఫోటోలు తీయించుకున్నారు. 

అలా హిందీ చిత్ర పరిశ్రమలో కీలక విభేదాన్ని పరిష్కరించిన పొలిటికల్ లీడర్‌గా బాబా సిద్దిఖీ పేరు పొందారు. తాజాగా ఆయన్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. బాబా సిద్ధిఖ్ 48 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram