Rivaba Jadeja Got BJP Ticket : Gujarat Elections బీజేపీ టికెట్ సంపాదించిన జడేజా భార్య | ABP Desam
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. వందమంది పేర్లతో కూడిన జాబితాను కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్ విడుదల చేశారు. అందులో జామ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి గానూ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు టికెట్ దక్కింది. 2016లో రవీంద్ర జడేజా, రివాబాల వివాహం జరిగింది. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రివాబా ప్రధాని మోదీని కలిసిన అనంతరం 2019లో బీజేపీలో చేరారు. డిసెంబర్ లో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ తరపున రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు రివాబా.