Ratan Tata Simple Life Style: గర్వం ఇసుమంతైనా లేని సింపుల్ మనిషి రతన్ టాటా

Continues below advertisement

చిన్న ఉద్యోగం చేస్తుంటేనే మనం వంద టెన్షన్ లు పడిపోతుంటాం. మనంత కష్టపడే మనిషి ప్రపంచంలోనే లేడని ఫీలైపోతుంటాం. అలాంటిది వేలకోట్ల సామ్రాజ్యమైన టాటా సంస్థలను నడుపుతూ కూడా రతన్ టాటా అస్సలు కంగారు పడేవారు కాదు. టెన్షన్ అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపించదు అంటారు సన్నిహితులు. ఇక రతన్ టాటా లైఫ్ స్టైల్ చూసినవాళ్లు ఎవరైనా ఈయన అసలు ఆగర్భ శ్రీమంతుడేనా అని సందేహ పడుతుంటారు. ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటుంది ఆయన జీవితం. ముంబైలో విలాసవంతమైన ఏరియాలో కోట్ల ఖర్చు చేసే  విల్లాలో ఆయన ఉండొచ్చు కానీ సింపుల్ గా ఓ చిన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు రతన్ టాటా. వృద్ధాప్యం మీదకు వచ్చినా రోజులో ఎక్కువ సేపు నేలమీదనే కూర్చుంటారు.

ఆయనకు భేషజాలు ఉండవు. నిగర్వి. మంచి మనసు. టాటా స్వంత సొంతంగా ల్యాండ్ రోవర్, జాగ్వార్ లాంటి కార్లను తయారు చేస్తుంది కానీ రతన్ టాటా ఇప్పటికీ టాటా సెడాన్ లేదంటే తనకెంతో ఇష్టమైన టాటా నానో కారు వేసుకుని ఒక్కరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారు. దారిలో ఎవరైనా స్నేహితులు కనిపించినా..చిన్న చిన్న కుక్క పిల్లలు కనిపించినా కారు వాటికి బిస్కెట్లు తినిపించటం రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన వ్యాపకం. అలాంటి రతన్ టాటా ఇక లేరనే విషయమే యావత్ దేశాన్ని కదిలించి వేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola