అపర కుబేరుడు రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

జీవితంలో డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో..మనల్ని అమితంగా ప్రేమించి...మన కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తుల సంపాదించుకోవటం కూడా అంతే ముఖ్యం.  కొంత మంది జీవితంలో దురదృష్టవశాత్తు ఒకటి ఉంటే మరొకటి ఉండదు. అపర కుబేరుడు..టాటాల వారసుడు రతన్ టాటా కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. 86ఏళ్ల రతన్ టాటా కన్ను మూసే సమయం వరకూ ఒంటరిగానే జీవించారు. ఆజన్మబ్రహ్మచారి మిగిలిపోయారు ఆయన. దీనికి రీజన్ ఏంటీ వేలకోట్ల ఆస్తి ఉన్న స్థితిమంతుడి జీవితంలో అర్థాంగి లేకపోవటం ఏంటీ అంటే దానికి రెండు రీజన్స్ చెబుతారు ఆయన సన్నిహితులు. మొదటిది చైల్డ్ హుడ్ ట్రామా. రతన్ టాటా జీవితం అంత సాఫీగా ఏం మొదలవ్వలేదు. పేరుకే అపర కోటీశ్వురలైనా తన కళ్ల ముందే తన చిన్నతనంలో తల్లి తండ్రులు ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉండేవారు. తండ్రి నావల్ టాటా, తల్లి  సోనీ టాటాల వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. 8 పదేళ్ల వయస్సులో ఆ ఘర్షణలను కళ్ల ఎదుటే చూసేవారట రతన్ టాటా. అందుకే బాల్యంలో ఆయన మనస్సులో కుటుంబం, పెళ్లి అంటే తెలియని భయాలు ఏర్పడ్డాయి అంటారు. రెండోది 1960 టైమ్ లో రతన్ టాటా అమెరికాలో ఉండేవారు. అక్కడ ఓ యువతిని టాటా విపరీతంగా ప్రేమించారు. ఆ అమ్మాయికి కూడా టాటా అంటే చాలా ఇష్టం. కానీ ఆమె తల్లితండ్రులు టాటాతో పెళ్లికి అప్పుడు ఒప్పుకోలేదట. కారణం 1962లో భారత్ చైనా ల మధ్యలో జరిగిన యుద్ధం అంటారు. ఆ టైమ్ లో భారత్ కు అమ్మాయిని పంపించటం ఆమె తల్లితండ్రులకు ఇష్టం లేదు..యుద్ధం సమయంలో దేశం విడిచి ఉండటం టాటాకు ఇష్టం లేదు. ఫలితంగా ఆ బంధం అక్కడితో ముగిసిపోయింది అంటారు. తర్వాత టాటా మరెవ్వరిని ప్రేమించలేదు. తర్వాత కంపెనీ పనుల్లో మునిగిపోయి...పూర్తిగా టాటా సంస్థల అభ్యున్నతికే అంకితమైపోయారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయారు రతన్ టాటా. ఆయన సోదరుడు జిమ్మీ టాటా కూడా పెళ్లి చేసుకోకపోవటం గమనార్హం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola