Ratan Tata News: చిన్న సంస్థల పాలిట దేవుడు, కొత్త ఐడియాలకు కొండంత అండ

Continues below advertisement

సాధారణంగా ఓ వ్యాపారి ఆలోచనా తీరు ఎలా ఉంటుంది. తనకు లాభాలు రావాలి. తన సంస్థ బాగుపడాలని కోరుకుంటారు అంతేగా. అందులో తప్పు లేదు. కానీ రతన్ లాంటి వాళ్లు ఎలా ఆలోచిస్తారో తెలుసా. మన దేశంలో కొత్త ఐడియాలతో ఎవరైనా యువకులు వ్యాపారం చేయటానికి సహాయం కోసం వస్తే వాళ్ల ఐడియా నచ్చితే రతన్ టాటా వాళ్ల సంస్థలో డబ్బు పెట్టేస్తారు. వాళ్లు ఆ డబ్బుతో వ్యాపారం చేసి..అది పెద్ద సంస్థగా మారితే ఆ సంస్థ మరో వందమందికి ఉపాధి కల్పిస్తుంది ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అనేది టాటా ఆలోచన. అసలు ఆయన డబ్బులు పెట్టడం కాదు నా ఆలోచన వెనుక రతన్ టాటా ఉన్నారు అన్న బ్రాండ్ ఆ పేరు చాలు ఆ స్టార్టప్ దశ మారిపోయినట్లే. అలా తన జీవితంలో ఇటీవలి కాలంలో 40 అంకుర సంస్థలకు మద్దతుగా నిలిచి ప్రాణం పోశారు. ఇప్పుడు నేను పేర్లు చెబుతాను వాటిలో ఇప్పుడు చాలా సంస్థల పేర్లు  మీరు ఇప్పుడు రోజు వింటున్నవే..కానీ అవి చిన్న మొక్కగా స్టార్ట్ అయినప్పుడే రతన్ టాటా వాటికి అండగా నిలిచారు. ప్రముఖ ఈ స్కూటర్ల తయారీ సంస్థ ఓలాకు పెట్టుబడిదారు రతన్ టాటానే.  

కళ్లజోళ్లకు తయారీకి సంబంధించి ఆన్ లైన్ లో ప్రముఖ మార్కెటింగ్ సంస్థగా ఎదిగిన లెన్స్ కార్ట్...మెట్రో, టైర్ 1 టైర్ 2 సిటీస్ లో ప్రముఖ సర్వీసెస్ కంపెనీగా ఎదిగిన అర్బన్ కంపెనీ, ప్రముఖ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం, స్టాక్స్ మీద పనిచేసే అప్ స్టాక్, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్ డీల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ 40 కంపెనీలంత ఉంది. ఈ కంపెనీలన్నింటికీ తొలి రోజుల్లో కొండంతా అండగా నిలబడి ఈ రోజు కంపెనీలు మార్కెట్లో దూసుకువెళ్లటానికి వాళ్లంతా వ్యాపార వేత్తలుగా మారి మరో పందిమందికి ఉపాధి కల్పించటానికి కారణమయ్యారు రతన్ టాటా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram