బంగ్లాదేశ్ జెండా చించేసిన రాజా సింగ్
BJP MLA T Raja Singh Tears Bangladesh Flags on Stage: గోషామహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ గోవాలో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు మతాలను ప్రభావితం చేస్తున్న లవ్ జిహాద్‌పై ఐక్య పోరాటానికి హిందువులతో చేతులు కలపాలని క్రైస్తవులకు విజ్ఞప్తి చేశారు. సౌత్ గోవాలోని కర్చోరెమ్‌లో బజరంద్ దళ్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. జిహాదీల జనాభా పెరిగి, వారి శాసనసభ్యుల సంఖ్య పెరిగితే వచ్చే 20 నుండి 30 సంవత్సరాలలో భారతదేశానికి హిందూ ప్రధాని ఉండరని అన్నారు. "లవ్ జిహాదీలు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేయరు. గోవాలోని మన క్రైస్తవ సోదరులకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. మీరు కేరళ ఫైల్స్ చిత్రాన్ని చూడాలి" అని రాజా సింగ్ అన్నారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ఎలా ప్రలోభపెట్టారో సినిమాలో చూపించారని.. లవ్ జిహాద్‌పై పోరాడేందుకు క్రైస్తవ సోదరులకు హిందువులు తలుపులు తెరిచి ఉంచారని అన్నారు.