ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో
బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ముగించుకొని వస్తూ మార్గమధ్యంలో ఆటో కార్మికుడి కుటుంబంతో కేటీఆర్ ముచ్చటించారు. బీఆర్ఎస్ మూడవ సారి అధికారంలోకి రాకపోవడం పట్ల చాలా బాధపడ్డాం అని ఆ మహిళ కేటీఆర్ తో చెప్పింది. బాధపడొద్దు మళ్లీ మనమే వస్తాం అని దైర్యం చెప్పి.. వారి పిల్లలతో కేటీఆర్ మాట్లాడారు. పిల్లలు జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయారు.
అంతకుముందు కేటీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం గురించి మాట్లాడుతూ.. ‘‘అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని, ఇప్పటివరకు దళితబంధుకు రూపాయి కూడా విడుదల చేయలేదు. దళితబంధు నిధులపై అసెంబ్లీలో సర్కారును ప్రశ్నిస్తాం. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయకుండా వ్యవసాయ రంగానికి చేస్తున్న అన్యాయాలపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ ఉద్యమం, చరిత్రపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు. మూర్ఖంగా, అనాలోచితంగా తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గమైన పనిని ప్రజల గొంతుకగా అసెంబ్లీ, మండలిలో నిలదీస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.