RahulBajaj PassesAway :హమారా బజాజ్' నినాదంతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన రాహుల్ బజాజ్ కన్నుమూత
గ్గజ వ్యాపారవేత్త రాహుల్ బజాజ్ ఇకలేరు. క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ప్రకటన విడుదల చేశారు. హమారా బజాజ్ నినాదంతో ఆయన ద్విచక్రవాహనాల తయారీ కంపెనీగా బజాజ్ ను తీర్చిదిద్దారు. రాజ్యసభ ఎంపీగానూ సేవలందించిన రాహుల్ బజాజ్...2021 నుంచి కంపెనీ బాధ్యతలను ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్ కి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ తో సత్కరించింది.