Rahul Gandhi with Nagaland Students | మనం మైండ్ సెట్స్ ను ఇక్కడే ఆపేస్తున్నారు | ABP Desam

 బ్యాటరీలు, ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు అంటూ మన మైండ్ సెట్ ను ఇంకా ఒకే చోట ఉంచేసే ప్రయత్నం జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. రీసెంట్ గా నాగాలాండ్ స్టూడెంట్స్ ను కలిసిన ఎంపీ రాహుల్ గాంధీ ఓ కారు ఇంజిన్ ను చూపిస్తూ పవర్ ఒకే చోట కేంద్రీకృతమైతే ఎంత ప్రమాదమో వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేషన్ వెహికల్స్ తో ఎలాంటి సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నాయో చెబుతూనే అధికార వికేంద్రీకరణ, కొత్త ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పారు రాహుల్ గాంధీ. అధికారం కేవలం కొంత మంది చేతుల్లోనే ఉండటం కారణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలకు రాజ్యాధికారాన్ని సాధించుకునే హక్కు ఉండదన్నారు. రాజ్యాంగ ప్రకారం అందరూ సమానమే కనుక అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడే సరైన ప్రగతి సాధ్యమని చెప్పారు రాహుల్ గాంధీ. ఇందుకు ఉదాహరణ గా ఓ పాత కారు ఇంజిన్ ను..ఓ ఈవీ కారు ఇంజిన్ లో ఉన్న తేడాలు గమనించుకోవచ్చని చెప్పారు రాహుల్ గాంధీ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola