Arvind Kejriwal Lost Election | ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ఓటమి | ABP Desam
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై పరాజయం పొందారు. మూడు సార్లు ఢిల్లీకి సీఎంగా చేసిన కేజ్రీవాల్ పొలిటికల్ కెరీర్ లో ఇదే తొలి ఓటమి. ఆప్ కు మరో కీలక నేత మనీశ్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. జంగ్ పుర నుంచి బరిలో ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ మార్వా చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ దాటుకుని బీజేపీ ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యతో ఉండటంతో కమలం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచ కాలుస్తూ డ్యాన్సులు చేస్తూ 26ఏళ్ల తర్వాత బీజేపీ సాధించిన అతి పెద్ద విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.1998లో సుషాస్వరాజ్ ఢిల్లీకి ఆఖరి సీఎంగా బీజేపీ తరపున పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే అధికారాన్ని చేజిక్కించుకోవటంతో దాదాపుగా 26ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.