
President Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam
మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పవిత్ర స్నానం చేశారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంకు చేరుకున్న రాష్ట్రపతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకమైన బోటులో త్రివేణి సంగమ స్నాన ప్రాంతానికి రాష్ట్రపతి చేరుకున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతికి పరిచారకులు దగ్గరుండి పవిత్ర స్నానం చేయించారు. భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం రాష్ట్రపతికి కలగకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజల్లో కాసేపు పాల్గొని పితృదేవలకు పూజలు నిర్వహించారు.రాష్ట్రపతి పర్యటన కోసం ప్రయాగ్ రాజ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ముర్ము పుణ్య స్నానం తర్వాత తన పితృదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతి హోమంలో పాల్గొన్నారు. ఇస్కాన్ వారు నిర్వహిస్తున్న నిత్య అన్నదానంలో పాల్గొని భక్తులకు ఆహారాన్ని, తీర్థ ప్రసాదాలను అందచేశారు.