PM Modi with Air Crash Survivors | ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ | ABP Desam

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ప్రధాని నరేంద్ర మొదట అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంటన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదానికి కారణాలపై అధికారులను, రామ్మోహన్ నాయుడును ఆయన ఆరా తీశారు.

అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. ఘోర విమాన ప్రమాదంలో చనిపోయన వారి కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని ప్రధాని పరామర్శించారు. విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు మహేష్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోదీ పరామర్శించి, అతడి అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విపత్కర సమయంలో రమేశ్ మానసిక స్థైర్యాన్ని కొనియాడారు ప్రధాని మోదీ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola