Air India Flight Crash New Bride Tragedy | అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నవ వధువు మృతి | ABP Desam

Continues below advertisement

అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మరణించారు. వీరిలో 20 ఏళ్ల ఖుష్బూ రాజ్‌పురోహిత్ అనే అమ్మాయి కూడా ఉంది. ఖుష్బూకు లండన్ లో సెటిల్ అయిన డాక్టర్ విపుల్‌ తో జనవరిలో పెళ్లి అయింది. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత విపుల్ లండన్‌కు తిరిగి వెళ్ళిపొయ్యాడు. పాస్‌పోర్ట్ , వీసా కోసమని ఖుష్బూ ఇండియాలోనే ఉండిపోయింది. వీసా రాగానే లండన్ కు బయలుదేరింది. ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది ఖుష్బూ. 

ఫ్లైట్ ఎక్కడానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో తన తండ్రి మదన్ సింగ్ తో ఖుష్బూ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమని విడిచి భర్త దెగ్గరికి వెళ్తున్న కూతురుని చూసి ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురు లండన్ వెళ్తున్న ఆనందంలో తండ్రి మదన్ సింగ్ ఎయిర్పోర్ట్ దెగ్గర ఖుష్బూతో ఫోటోలు దిగి వాట్స్ యాప్ లో స్టేటస్ పెట్టారు. "ఆశీర్వాద్ ఖుష్బూ బీటా, లండన్ వెళ్తుంది అంటూ తన స్టేటస్ లో పెట్టారు మదన్ సింగ్. మదన్ సింగ్ కుటుంబం తమ ఇంటికి  కూడా చేరుకోలేదు. అంతలోనే తమ కూతురు ఇక లేదు అన్న వార్త ఖుష్బూ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.  ఖుష్బూ లండన్ కి వెళ్లే ముందు తన కుటుంబాన్ని కలిసిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఖుష్బూకి ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. 

లండన్‌కు బయలుదేరిన విమానం AI171, బోయింగ్ 787 అహ్మదాబాద్‌లోనే కుప్పకూలింది. మృతుల్లో భారత్ తోపాటు యుకె, పోర్చుగల్, కెనడాకు చెందిన వారుకూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేస్తుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola