Modi Meet: మీరంతా విజేతలే.. యువతలో స్ఫూర్తిని నింపారు.. ఒలింపిక్స్‌కు వెళ్లిన ఆటగాళ్లతో ప్రధాని మోదీ
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 16న ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్లతో ముచ్చటించారు. ఒలింపిక్స్ వరకు వెళ్లడమే గొప్ప విజయమని జయాపజయాలను పట్టించుకోవద్దని... పది మందిలో స్ఫూర్తిని నింపారని అభిప్రాయపడ్డారు. అటగాళ్లందరినీ పేరుపేరున పలకరించిన ప్రధాని... వారు ఎదుర్కొన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అందరితోనూ ఆత్మీయంగా మాట్లాడారు.