Nita Ambani Varanasi Visit | Anant Ambani Radika Merchant పెళ్లి శుభలేఖను కాశీలో ఇచ్చిన నీతా అంబానీ

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్నారు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల వివాహ ఆహ్వాన పత్రికను తీసుకువచ్చిన నీతా అంబానీ...కాశీ విశ్వనాధుడు, విశాలాక్షి అమ్మవార్ల పాదాల చెంత శుభలేఖను ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారికి, అమ్మవారికి వేర్వేరుగా బంగారు పూత పూసిన శుభలేఖలను చేయించిన అంబానీలు..వాటిని ఓ విలువైన పెట్టెలో ఉంచి స్వామి అమ్మవార్లకు సమర్పించారు.  కాశీ విశ్వనాధుడికి ప్రత్యేక పూజలను నిర్వహించిన తర్వాత గంగా హారతి కార్యక్రమంలోనూ నీతా అంబానీ పాల్గొన్నారు. సాధారణ భక్తులతో కలిసి హరహరమహాదేవ్ అంటూ హారతి కార్యక్రమం మొత్తం వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నీతా అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి కాశీ విశ్వనాధుడి ఆశీర్వాదం కోసం పదేళ్ల తర్వాత వారణాసికి వచ్చానని...మహాదేవుడిని దర్శించుకోవటం అలౌకికమైన ఆనందాన్ని కలిగించిందన్నారు. కాశీ కారిడార్ అభివృద్ధి, ఆలయంలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతమంటూ కొనియాడారు నీతా అంబానీ. జులై 12నుంచి ఐదు రోజుల పాటు వేడుకగా అనంత్, రాధికా మర్చంట్ ల పెళ్లి జరగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola