Mysuru Dasara : కర్ణాటకలో ఘనంగా దసరా...పాల్గొన్న కర్ణాటక సీఎం | ABP Desam
మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా చాముండేశ్వరి దేవి అమ్మవారికి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ఏనుగుల అంబారీపై అమ్మవారి ఉత్సవ మూర్తులను నగర వీధుల్లో ఊరేగించారు. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు.