
Maha Kumbha Mela 2025 | ప్రయాగరాజ్ కు పోటెత్తుతున్న భక్తులు | ABP Desam
మహాకుంభమేళా ప్రయాగ్ రాజ్ లో కన్నుల పండువగా జరుగుతోంది. రేపు మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో రెండో అమృత స్నానం నిర్వహిస్తారు. అమృత స్నాన ఘడియల్లో 144ఏళ్ల కు ఓసారి వచ్చే మహాకుంభమేళాలో పాల్గొనటం కోసం దేశవ్యాప్తంగా ఉన్న నాగా సాధువులు, అఘోరాలు తరలివస్తారు. అత్యంత పవిత్రక్షణాలుగా భావించే ఆ సమయంలో స్నానం కోసం త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు రేపు కలిపి కనీసం పదికోట్ల మందికి భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మౌని అమావాస్య కారణంగా ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుపుతున్నా భక్తులకు అవి ఏ మాత్రం సరిపోవటం లేదు. విమాన ఖర్చులు బాగా పెరిగిపోవటంతో కోట్లాది మంది పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం కోసం రోజులు తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. యూపీ ప్రభుత్వం భక్తులకు కనీస సౌకర్యాలు అందించటం కోసం తీవ్రంగా కష్ట పడుతోంది.