
ISRO's Histroic 100th Launch Success | నేవిగేషన్ శాటిలైట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టిన ఇస్రో | ABP Desam
జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సూపర్ సెంచరీ కొట్టేసింది. శ్రీహరికోట నుంచి ఈ రోజు ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్ 15రాకెట్ ప్రయోగం ద్వారా వందో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. సెకండ్ జనరేషన్ నేవిగేషన్ శాటిలైట్ అయిన ఎన్వీఎస్ 02 కక్ష్యలో విజయంవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో...తన ఖాతాలో వందో ప్రయోగాన్ని చేర్చుకోవటంతో పాటు వందో ప్రయోగంలో విక్టరీ కొట్టిన దేశంగానూ కీర్తిగడించింది. భవిష్యత్తులోనూ చేపట్టబోయే మిషన్స్ కు నేవిగేషన్ అందించటం తో పాటు సాధారణ పౌరులకు ఉపయోగపడే టెక్నాలజీ ఉన్న శాటిలైట్ ను ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ వీ నారాయణనన్ తెలిపారు. ప్రపంచంలో ఓ గొప్ప అంతరిక్ష సంస్థగా ఈ రోజు ఇస్రో నిలబడటం వెనుక ఎంతో మంది కష్టం ఉందన్నారు ఆయన. భవిష్యత్తు ప్రయోగాలకు నూతనంగా నిర్మించే లాంఛ్ ప్యాడ్ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపిన ఇస్రో ఛైర్మన్...గగన్ యాన్ భారత్ సొంతంగా నిర్మించుకునే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రయోగాలకు ఇది నాంది అవుతుందన్నారు.