
CM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam
త్రివేణి సంగమంలో 4 కోట్ల మంది ఈరోజు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉదయం తొక్కిసలాట జరిగిన ఘటనలో 20మంది చనిపోయిన ఘటనపై మాట్లాడిన యోగి..ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటివరకూ ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారని చెప్పారు యోగి ఆదిత్యనాథ్. సీఎం వైపు ఓ చెబుతున్నా మరోవైపు భక్తులను అదుపు చేసే పరిస్థితులు కనిపించటం లేదు. కొన్ని వేలమంది గోడలు దూకి త్రివేణి సంగమంలో స్నానం చేయాలని పరుగులు పెడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. త్రివేణి సంగమం వైపు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు. గంగానదిలో మరింత భక్తులు స్నానం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ కుంభమేళాలో 19 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని ఒక్క మౌని అమావాస్య రోజే 5 నుంచి 8 కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.