
Maha Kumbh 2025 Prayag Raj Drone Visuals
ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళా కు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా తరలివస్తున్న కోట్లాది మంది భక్తులతో త్రివేణి సంగమం ప్రాంతం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసినా భక్తుల మధ్య తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తెల్లవారు జామున జరిగిన తొక్కిసలాటలో 20 మంది భక్తులు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోజు వరకూ మహా కుంభమేళాలో 19 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. మౌని అమావాస్య రోజే ఏకంగా 4 నుంచి 5కోట్ల మంది స్నానాలు చేయొచ్చని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినా అవి ఏ మాత్రం సరిపోలేదు. డ్రోన్ విజువల్స్ లో త్రివేణి సంగమం ఓ సారి చూడండి. ఇసుకేస్తే రాలని విధంగా ఉన్న భక్త జన సంద్రంతో నిండిపోయింది ప్రయాగ్ రాజ్.