Kerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desam

Continues below advertisement

 కేరళ సీఎం పినరయి విజయన్ కు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. తిరువనంతపురం లోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. సీఎం పినరయిన్ విజయన్  కాన్వాయ్ కు అడ్డంగా ఓ వ్యక్తి స్కూటర్ రావటంతో కాన్వాయ్ లోని పైలెట్ వెహికల్ కు బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీంతో కాన్వాయ్ లోని వెనుక వాహనాలన్నీ ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. లిప్తపాటు కాలంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో విజయన్ ప్రయాణిస్తున్న వాహనం డ్యామేజ్ అయినా ఆయనకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. హుటాహుటిన అప్రమత్తమైన వైద్యులు సీఎం వద్దకు వెళ్లి ఆయన పరిస్థితిని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో సీఎం పినరయి విజయన్ ప్రత్యేక ప్రోటోకాల్ పాటించరు. ఆయన వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ను ఆపొద్దని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సీఎం ఆదేశాలున్నాయి. అందుకే ఇలాంటి ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి భద్రతావిభాగం కేంద్ర హోంమంత్రిత్వశాఖకు రిపోర్ట్ చేసిందని తెలిపింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram