Vijay First Political Meeting Highlights | విల్లుపురంలో దమ్ము చూపించిన తలపతి విజయ్ | ABP Desam

 తలపతి విజయ్ అభిమానులు ఎన్నాళ్లూగానో ఎదురు చూస్తున్న మొదటి రాజకీయ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విల్లుపురంలో విజయ్ నిర్వహించిన మొదటి రాజకీయ సభకు ఐదులక్షల మంది అభిమానులు హాజరయ్యారు. కిక్కిరిసిపోయిన మైదానంలో కిలోమీటరు పాటు ఏర్పాటు చేసిన ర్యాంప్ లో నడుస్తూ పరిగెడుతూ తన కోసం వచ్చిన అభిమానులను పలకరించారు విజయ్. తనపై కి ప్రేమగా విసురుతున్న కండువాలను తీసుకుని మెడలో వేసుకుంటూ అందరినీ పలకరిస్తూ స్టేజ్ దగ్గరకు తిరిగి చేరుకున్నాడాయన. ఆర్మీ మాజీ జవాన్ ర్యాంప్ పైకి ఎక్కి విజయ్ కు సెల్యూట్ చేయటం అలరించింది. విజయ్ తల్లితండ్రులు తమ కుమారుడి ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ కు హాజరయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే వదిలేస్తున్నాన్న విజయ్..టెక్నాలజీ మారింది రాజకీయమూ మారాలంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. 2026 ఎలక్షన్స్ టార్గెట్ గా విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సంస్థాగత కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన విజయ్..ఆఖరి సినిమాను పూర్తి చేసి ఇక కేవలం రాజకీయాలపైనే దృష్టిపెడతానని ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు కష్టపడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇటీవలి కూటమిగా బరిలోకి దిగి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సినిమాల పరంగా సమఉజ్జీగా, సమకాలికుడిగా ఇదే ఒకే తరహా సినిమాలు చేస్తూ పెద్దసంఖ్యలో అభిమానుల్లో కల్ట్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పుడు డీఎంకే తప్ప మరో పెద్ద పార్టీ కనిపించని తమిళనాడులో పార్టీ పెట్టిన విజయ్..ఆంధ్రలో పవన్ కళ్యాణ్ లానే  రెండో ఫీల్డ్ లోనూ విక్టరీ అందుకుంటున్నారా అన్నది చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola