Desam Adugutondi: దేశం స్వాతంత్య్రం పై కంగనా సంచలన వ్యాఖ్యాలు
మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది.. ఇదేం ప్రశ్న.. స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లాడు కూడా చెప్తాడు... 1947 ఆగస్టు 15 అని మీరు అనుకుంటుండొచ్చు..ఆ మాత్రం కూడా తెలీదా అని అనొచ్చు. కానీ దేశంలోనే ఓ పేరు మోసిన సెలబ్రిటీ మనకు స్వాతంత్రం 2014లో వచ్చిందని ఓ కాన్ క్లేవ్ లో అంటే.. అక్కడున్న చాలామంది చప్పట్లు కొట్టారు. 1947లో మనకు వచ్చింది భిక్ష అని 14లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆమె చెప్పిన మాట కొంత మందికి ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇస్తే.. దేశంలో చాలామంది నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది.. సాదాసీదా వ్యక్తి కాదు.. దేశంలో చాలామందికి తెలిసిన ప్రముఖ నటి..నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న నటి. దేశంలో ఉన్నత పౌరపురస్కారం పద్మశ్రీ కూడా అందుకున్న వ్యక్తి. ఇంకా చప్పాలంటె ఆ పద్మశ్రీ పురష్కారం అందుకున్న కొద్ది సేపటికే ఆ వ్యఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై దేశం రగిలిపోతోంది. ఎంతో మంది స్వతంత్రవీరుల త్యాగాలను కంగన అగౌరవ పరిచారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.