
ISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP Desam
ఇస్రో చరిత్ర సృష్టించింది. స్పేడెక్స్ రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో డాకింగ్ చేయటం ద్వారా ఈ ఘనత సాధించిన నాలుగోదేశంగా అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యయానికి నాంది పలికింది. డిసెంబర్ 31న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు స్పేడెక్స్ పేరుతో రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఈ రెండింటీకి మధ్య 475 కిలోమీటర్ల దూరం ఉండేలా చూశారు. ఛేజర్, టార్గెట్ అని పిలుచుకునే ఈ రెండు ఉపగ్రహాల మధ్య మెల్ల మెల్లగా దూరం తగ్గిస్తూ వచ్చారు. చివరగా రెండు ఉపగ్రహాల మధ్య 15మీటర్ల దూరం ఉన్నప్పుడు డాకింగ్ ప్రక్రియను ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలు 3మీటర్ల దగ్గరకు వరకూ తీసుకువచ్చి రెండు ఉపగ్రహాలు ఇదిగో ఇలా అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్లుగా రెండింటినీ అనుసంధానం చేయటం ద్వారా తొలిసారిగా స్పేస్ లో డాకింగ్ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయగలిగారు. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ తర్వాత స్పేస్ లో డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. భవిష్యత్తులో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి చాలా పరికరాలను అంతరిక్షంలోనే డాకింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఈ విజయం కోసం అనుసరించిన పద్ధతి ఉపయోగపడుతుంది.