
Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP Desam
బాలీవుడ్ బడా హీరోలను ఎవరు టార్గెట్ చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న దాడులు...హత్యాయత్నాలు దేనికి సంకేతం. పొలిటీషియన్ బాబా సిద్ధిఖీ మర్డర్ కి...సల్మాన్ ఖాన్ పై వస్తున్న బెదిరింపులకు, ఇవాళ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడికి ఏమైనా సంబంధం ఉందా. ఇప్పుడు ఇదే ప్రశ్న బాలీవుడ్ ను వణికిస్తోంది. సినిమా వాళ్లతో సత్సంబధాలున్న రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న బాబా సిద్ధిఖీ హత్య హిందీ చిత్రసీమలో ప్రకంపనలు రేపింది. సల్మాన్ ఖాన్ ను హత్య చేయటమే టార్గెట్ ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ప్రణాళికలను రచిస్తున్నట్లు బాహాటంగానే ప్రకటించకున్నారు. సల్మాన్ ఇంటిపై తుపాకులపై కాల్పులు, బెదిరింపు ఫోన్ కాల్స్ తరచూ ఇబ్బంది పెడుతుండటంతో... సల్మాన్ హై సెక్యూరిటీ జోన్ లోకి వెళ్లిపోయారు. ఈ రోజు మరో బడా స్టార్ సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. సైఫ్ అలీఖాన్ ను తన ఇంట్లోనే కత్తి పెట్టి దారుణంగా పొడిచారు. ఇది నిజంగా ఇంటికి దొంగతనానికి వచ్చిన వ్యక్తే చేశాడా లేదా ఎవరైనా ప్లాన్డ్ గా వచ్చి చేసిన హత్యాయత్నమా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ..బాలీవుడ్ లో బడా ఫ్యామిలీస్ లో ఒకటైన పటౌడీ ఫ్యామిలీ కూడా డేంజర్ జోన్ లోకి వెళ్లిపోవటం అందరినీ కంగారు పెడుతోంది. ప్రత్యేకించి ముంబైలో ఓ వర్గం హీరోలు వాళ్లకు అండగా ఉంటున్న పొలిటీషియన్స్ టార్గెట్ గా ఇవన్నీ జరుగుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి సైఫ్ పై దాడి గురించి పోలీసులు ఏ సంచలన విషయాలను బయటపెడతారో.