ISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP
స్పేస్ సైన్స్ ఎప్పుడూ ఇంతే. ఒక్కసారి ఇందులో ఉన్న గొప్పతనం తెలుసుకున్నామా ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ఎన్నడూ లేనంతగా కేంద్రప్రభుత్వం ఇస్రో ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించింది. ఎంతో తెలుసా అక్షరాలా 22వేల 750కోట్లు. చంద్రయాన్ 3 విజయంతం కావటంతో మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ వచ్చింది. అండ్ స్పేస్ కామర్స్, టెక్నాలజీ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఈ టైమ్ లో ఇంత డబ్బును కేంద్రం ఇస్రోకు ఇవ్వటం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అసలు ఏ ప్రాజెక్టుల కోసం ఇంత డబ్బును మోదీ సర్కార్ కేటాయించిందో తెలుసుకున్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఆసక్తికర ప్రాజెక్టులేంటో ఈ వీడియోలో చూద్దాం.చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ తర్వాత అంటే చంద్రుడి దక్షిణధృవం వద్ద ల్యాండర్ ను ఇస్రో సక్సెస్ ఫుల్ గా దింపిన తొలిదేశంగా రికార్డు సృష్టించిన తర్వాత చంద్రయాన్ 4 మీద దృష్టి పెట్టింది భారత్. ఈసారి మన లక్ష్యం చంద్రుడి మీద ల్యాండర్ ను దింపి అక్కడ శాంపుల్స్ ను సేకరించి తిరిగి భూమి మీదకు తీసుకురావటం ఇస్రో ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ కోసం 2వేల 104కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. టార్గెట్ ఒక్కటే 2040లోపు చంద్రుడి మీదకు ఒక భారతీయుడు సొంతంగా ల్యాండ్ అవ్వాలి. సో ఈలోగా ఈ చంద్రయాన్ మిషన్ ద్వారా వీలైనన్ని ప్రయోగాలు కంప్లీట్ మీద చంద్రుడి మీద అక్కడి పరిస్థితుల మీద మన ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి అవగాహనకు రావాలి. అందుకోసమే ఈ ఖర్చంతా.