షీనా బోరా హత్యకేసులో సంచలన విషయం చెప్పిన ఇంద్రాణి ముఖర్జియా

షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురు బతికే ఉందని కశ్మీర్‌లో వెదకాలని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. షీనా బోరా హత్య కేసు. కొన్నేళ్ల క్రితం చాలా రోజుల పాటు దేశం మొత్తం ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అసలు హత్యకు గురయిందని భావిస్తున్న షీనా బోరా బతికే ఉందట. సీబీఐ ఆమె ఆచూకీ కనిపెట్టాలని ఆమె తల్లి, షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా చాలా రోజులుగా జైల్లో ఉన్న ఇంద్రాణి ముఖర్జియా అంటున్నారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌కు ఆమె లేఖ రాశారు. కశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని జైలులో ఉన్న తనను ఇటీవల ఓ మహిళ కలిసి చెప్పిందని లేఖలో చెప్పారు. కాశ్మీర్‌లో షీనా బోరాను వెతకాలని ఆమె సీబీఐని కోరారు. లేఖతో పాటు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola