Gyanvapi Mosque Case:సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేసిన సుప్రీం| ABP Desam

Continues below advertisement

జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్‌ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదం చాలా సున్నితమైందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే వారణాసి సివిల్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బదిలీ చేసినట్టు తెలిపింది. మసీదులో సీల్ వేసిన ప్రాంతాన్ని అలానే ఉంచాలని ఆదేశించింది. ముస్లింలు యథావిధిగా నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుపై ఇటీవల తాము ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని సుప్రీం పేర్కొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram