
Gautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP Desam
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. స్పెషల్ ఫ్లైట్ లో ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న ఆయన మహాకుంభమేళా లో పాల్గొనటం చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ప్రయాగ్ రాజ్ లో ఇస్కాన్ క్యాంప్ కు అదానీ వెళ్లారు. ఇస్కాన్ లో మహాకుంభమేళాకు వచ్చే భక్తులకు జరుగుతున్న అన్నదాన సేవలో అదానీ కూడా పాలు పంచుకున్నారు. స్వయంగా గరిటె పట్టి ఆహారపదార్థాలను తయారు చేశారు. ఆ తర్వాత భక్తులకు తనే ఆహారాన్ని వడ్డించారు.భక్తులకు అన్నదానం చేసిన తర్వాత తన కుటుంబంతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు గౌతమ్ అదానీ. అన్నదాన సేవ తర్వాత త్రివేణి సంగమానికి చేరుకున్న అదానీ కుటుంబంతో కలిసి పవిత్ర స్నానానికి బయల్దేరారు. ప్రత్యేకంగా తయారు చేసిన పడవలో నదీ స్నానం చేసి.. తర్వాత అక్కడే నిర్వహించిన ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అదానీ...మహాకుంభమేళా ఏర్పాట్లను కొనియాడారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. మహాకుంభమేళాలోనే తన కుమారుడి పెళ్లి గురించి ప్రకటన చేశారు గౌతమ్ అదానీ. ఫిబ్రవరి 7న జీత్ అదానీ పెళ్లి జరుగుతుందన్న అదానీ...చాలా సింపుల్ గా, అన్ని అచారాలను పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. మహాకుంభమేళాలో ప్రత్యేక పూజల తర్వాత కుటుంబంతో కలిసి అదానీ..లేటే హనుమంతుడి మందిరానికి వెళ్లారు. అక్కడ కుటుంబంతో కలిసి పూజలన ునిర్వహించారు.