Draupadi Murmu New President : దేశ ప్రథమ పౌరుడికి లభించే సౌకర్యాలు ఇవే | ABP Desam
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రతిభా పాటిల్ తరవాత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా నిలిచారు. దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వం తరపున ఇచ్చే గౌరవాలు, లాంఛనాలు అదే ఉన్నతంగా ఉంటాయి. ఆమెకు ఎంత జీతం ఇస్తారు..? ఆమె ఏ కార్‌లో వెళ్తారు...? అసలు రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది..? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.