Delhi Water Crisis | ఢిల్లీలో హింసకు దారి తీస్తున్న నీటి సంక్షోభం | ABP Desam
ఢిల్లీ తాగు నీటి సంక్షోభం హింసాత్మక ఘటనలకు దారి తీసింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మంచినీరు దొరకటం లేదంటూ ఆందోళన చేస్తున్న ప్రజలు..ఈ రోజు ఢిల్లీ జల శక్తి ఆఫీస్ పై దాడి కి దిగారు. చేతిలో తెచ్చిన కుండలను జల్ శక్తి ఆఫీసు అద్దాలపై విసిరి నానా విధ్వంసం చేశారు. అయితే ఈ విధ్వంసాలకు కారణం బీజేపీ అంటూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి ప్రతి ఆరోపణలకు చేశారు. గుండాలను తీసుకువచ్చి ప్రభుత్వ కార్యాలయాలపై బీజేపీ దాడులు చేయిస్తోందని ఆతిషి ఆరోపించారు. హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటాను రానివ్వకుండా అడ్డుకుంటారన్న ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ...పైప్ లైన్ లను కావాలనే పగులగొట్టి నీరు వృథా అయ్యేలా చేస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఢిల్లీ పోలీసులు పైప్ లైన్లను పరిశీలించారు. ఈశాన్య ఢిల్లీలోని యుమునా ఖదార్ ప్రాంతంలోని జల్ శక్తి పైపులైన్లను పరిశీలించి అంతా బాగానే ఉన్నట్లు ప్రకటించారు. పదిహేను రోజుల పాటు పైపులైన్ల దగ్గర పోలీసులు కాపలా కాస్తారని తెలిపారు.